యువత క్రీడా స్ఫూర్తి అలవర్చుకోవాలి | - | Sakshi
Sakshi News home page

యువత క్రీడా స్ఫూర్తి అలవర్చుకోవాలి

Jun 2 2026 6:05 AM | Updated on Jun 2 2026 6:05 AM

రాజ్యసభ మాజీ సభ్యుడు నెక్కంటి

రాయగడ: యువత క్రీడాస్ఫూర్తిని అలవర్చుకోవాలని రాజ్యసభ మాజీ సభ్యుడు, బిజూ స్వాభిమాన్‌ మంచ్‌ వ్యవస్థాపకులు నెక్కంటి భాస్కరరావు అన్నారు. జిల్లాలోని సదరు సమితి కర్లకొణ గ్రామంలో నేతాజీ సుభాష్‌ చంద్ర బోస్‌ యూత్‌ క్లబ్‌ ఆధ్వర్యంలో నిర్వహించిన క్రికెట్‌ టోర్నమెంటు ముగింపు కార్యక్రమం సోమవారం జరిగింది. ముఖ్యఅతిథిగా హాజరైన ఆయన మాట్లాడుతూ.. వచ్చిన అవకాశాలను యువత సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. క్రీడల్లో ఆసక్తి కనబరిచే యువత ఆయా రంగాల్లో రాణించాలంటే అందుకు కృషి, శ్రమతో పాటు సహనం కూడా ఎంతో అవసరమని పేర్కొన్నారు. ఇటువంటి తరహా పోటీల్లొ పాల్గొంటే వారికి నైపుణ్యం మెరుగుపడటంతో పాటు ప్రతిభను కూడా కనబరిచే అవకాశం ఉంటుందన్నారు. అతిథులుగా మాజీ మంత్రి లాల్‌ బిహారి హిమిరిక, ఆదిత్య లాజిస్టిక్స్‌ ఎండీ కృష్ణ చైతన్య, కర్లకొణ సర్పంచ్‌ నీలాంబర్‌ బిడిక, సమితి సభ్యురాలు బందనా అటక, యువ నాయకుడు తపన్‌ పెద్దింటి, నేతాజీ సుభాష్‌ చంద్రబోస్‌ యూత్‌ క్లబ్‌ అధ్యక్షుడు సదానంద పెద్దింటి పాల్గొన్నారు. కాగా సోమవారం కులిజింగ్‌, కర్లకొణ జట్ల మధ్య ఫైనల్‌పోరు రసవత్తరంగా జరిగింది. విజేతగా కలజింగ్‌ జట్టు విజయం సాధించింది. విజేత జట్టుకు ట్రోఫీతో పాటు 15 వేల రూపాయల నగదు బహుమతిని, రన్నర్‌ జట్టుకు ట్రోఫీని ముఖ్యఅతిథి నెక్కంటి అందజేశారు.

Advertisement
 
Advertisement
Advertisement