గ్రీవెన్స్‌లో 28 సమస్యలు పరిష్కారం | - | Sakshi
Sakshi News home page

గ్రీవెన్స్‌లో 28 సమస్యలు పరిష్కారం

Jun 2 2026 6:05 AM | Updated on Jun 2 2026 6:05 AM

రాయగడ: స్థానిక డీఆర్‌డీఏ సమావేశ మందిరంలో జిల్లా కలెక్టర్‌ అశుతోష్‌ కులకర్ణి అధ్యక్షతన సోమవారం నిర్వహించిన గ్రీవెన్స్‌సెల్‌కు మంచి స్పందన లభించింది. ప్రజల బాధలు తెలుసుకున్న కలెక్టర్‌ వేదిక వద్దే 28 సమస్యలను పరిష్కరించారు. అలాగే వచ్చిన 65 వినతుల్లో భాగంగా మరో ఐదుగురికి రెడ్‌ క్రాస్‌ నిధుల నుంచి 76 వేల రూపాయల ఆర్థిక సహాయాన్ని అందించారు. మిగిలిన వినతులను పరిశీలించి సకాలంలో పరిష్కరించాలని సంబంధిత శాఖ అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో జిల్లా ఎస్పీ రాజ్‌ ప్రసాద్‌, సబ్‌ కలెక్టర్‌ రమేష్‌ కుమార్‌ జెన్నా, డీఎఫ్‌వో సచిన్‌ అన్నాసాహెబ్‌ అహలే, జిల్లా ముఖ్యవైద్యాధికారి డాక్టర్‌ ప్రశాంత్‌ మిశ్రో, జిల్లా పరిషత్‌ ముఖ్య కార్యనిర్వాహక అధికారి అక్షయ కుమార్‌ కెముండో , ఇతర శాఖల అధికారులు,ఉద్యొగులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement