చంద్రపూర్‌లో మహిళల ర్యాలీ | - | Sakshi
Sakshi News home page

చంద్రపూర్‌లో మహిళల ర్యాలీ

May 22 2026 12:48 AM | Updated on May 22 2026 12:48 AM

రాయగడ: జిల్లాలోని చంద్రపూర్‌లొ నారీశక్తి వందన్‌ చట్టానికి మద్దతుగా గురువారం మహిళలు భారీ ర్యాలీ నిర్వహించారు. బీజేపీ జిల్లా మహిళా మోర్చ అధ్యక్షురాలు కొరాడ రజిత నేతృత్వంలో చేపట్టిన ర్యాలీలో అధికసంఖ్యలో మహిళలు పాల్గొన్నారు. మహిళల సాధికారతకు బలొపేతం చేయడమే లక్ష్యంగా తీసుకువచ్చిన చారిత్రాత్మక చట్టం ద్వారా శాసనసభలు, పార్లమెంటులో మహిళలకు 33 శాతం రిజర్వేషన్‌ కల్పించనున్న నేపథ్యంలో ఈ కార్యక్రమం విశేష ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ సందర్భంగా మహిళలు పురవీధుల్లో బ్యానర్లతో ర్యాలీ నిర్వహించి ప్రజలకు చట్టంపై అవగాహన కల్పించారు. కార్యక్రమంలో బీజేపీ మహిళా మోర్చకు చెందిన విజయ, జిల్లా ఉపాధ్యక్షురాలు సుశీలా సబర్‌ పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement