జయపురం: మహిళా రిజర్వేషన్ బిల్లు ఎప్పుడో 2023లోనే ఆమోదం పొందినా అమలు చేయకుండా ప్రధాన మంత్రి మోదీ, బీజేపీ ప్రభుత్వం మోసం చేస్తోందని ఒడిశా రాష్ట్ర మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు మీనాక్షి బాహిణీపతి ఆరోపించారు. మహిళలకు తీరని ద్రోహం చేస్తున్న మోదీ మహిళా విరోధి అని దుయ్య బట్టారు. బుధవారం రాత్రి జిల్లా మహిళా కాంగ్రెస్ ఆధ్వర్యంలో నిర్వహించిన దివిటీల ర్యాలీలో ఆమె పాల్గొన్నారు. పార్లమెంట్‌లో ఆమోదించిన మహిళా బిల్లును డీ లిమిటేషన్ బిల్లుతో కలిపి పెట్టడం కుట్రపూరితమని అన్నారు. కాంగ్రెస్ పార్టీతో పాటు విపక్ష పార్టీలు డీ లిమిటేషన్ బిల్లును వ్యతిరేకించాయే గానీ మహిళా సంరక్షణ బిల్లు కాదని ఆమె స్పష్టం చేశారు. వెంటనే 33 శాతం మహిళా రిజర్వేషన్ ను అమలు చేయాలని ఆమె డిమాండ్ చేశారు. ఎమ్మెల్యే తారాప్రసిద్ బాహిణీపతి మాట్లాడతూ బీజేపీ మహిళా విరోధి అని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ మహిళల హక్కులు, వారి సంక్షేమం ఎప్పుడూ కోరుతుందని పేర్కొన్నారు.


