● క్రికెట్‌ టోర్నీ ప్రారంభం | - | Sakshi
Sakshi News home page

● క్రికెట్‌ టోర్నీ ప్రారంభం

Apr 9 2026 8:35 AM | Updated on Apr 9 2026 8:35 AM

జయపురం: జయపురం స్టేడియం గ్రౌండ్‌లో బుధవారం క్రికెట్‌ టోర్నీ ప్రారంభమైంది. జయపురం ఈవినింగ్‌ క్లబ్‌ ఆధ్వర్యంలో పోటీలు నిర్వహిస్తున్నారు. క్రికెట్‌ లీగ్‌ను జయపురం సబ్‌ డివిజనల్‌ పోలీసు అధికారి అర్చిత మిత్తల్‌ (ఐపీఎస్‌) ప్రారంభించారు. క్రీడాకారులను ఉద్దేశించి ఆమె మాట్లాడారు. ఆటలు మనోవికాసానికి, శారీరక ఆరోగ్యానికి దోహద పడతాయన్నారు. యువత క్రీడలకు అధిక ప్రాధాన్యం ఇవ్వాలన్నారు. రెండు మ్యాచ్‌లు జరిగాయి. మొదటి మ్యాచ్‌లో జగన్నాథ్‌ సూపర్‌ జియాండ్‌ ధల్‌, బ్రాండెడ్‌ వాయిస్‌ జట్లు తలపడ్డాయి. జగన్నాథ్‌ సూపర్‌ జియాండ్‌ దల్‌ విజయం సాధించింది.

రెండో మ్యాచ్‌లో జెకెసిఇటి స్పార్కింగ్‌ స్పోర్ట్స్‌, జయపురం జాగుతార్‌ టీమ్‌లు తలపడ్డాయి. ఈ బ్యాచ్‌లో జయపురం టీమ్‌ విజయం సాధించింది. దేబొ చౌదరి, బాబుల, అనంత నాయక్‌, సుబేన్‌ అంపైర్‌లుగా వ్యవహరించారు. క్రికెట్‌ పోటీలు ఈ నెల 19వ తేదీ వరకు జరుగుతాయని నిర్వాహకులు వెల్లడించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement