మల్కన్‌గిరి: మల్కన్‌గిరి జిల్లా యంత్రగం తరఫున బండాబాకులి చెరువు వద్ద బాలికలకు ఈత, ప్రాణ రక్షణ నైపుణ్యాల శిక్షణ శిబిరాన్ని జిల్లా కలెక్టర్ ప్రధమేశ్ అర్వింద్ రాజశిర్కే బుధవారం ప్రారంభించారు . ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బాలికల భద్రత, శక్తివంతం చేయడం తమ ప్రధాన లక్ష్యమని అన్నారు . ఈత కేవలం వ్యాయామం మాత్రమే కాకుండా ఆపద సమయంలో ప్రాణ రక్షణకు దోహదపడుతోందన్నారు. ఈ శిక్షణ బాలికల్లో ధైర్యం, ఆత్మవిశ్వాసాన్ని పెంచి అత్యవసర పరిస్థితులను ధైర్యంగా ఎదుర్కొనే సామర్‌ాధ్యన్ని కలిగిస్తుందని కలెక్టర్ అన్నారు. శిక్షణలో ఓడ్రాఫ్ బృందానికి చెందిన 20 మంది అనుభవజ్ఞులైన శిక్షణదారులు 30 మంది బాలికలకు ఏడు రోజులు శిక్షణ ఇస్తారు. కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్ వేద్బ్‌ర్ ప్రధన్, మల్కన్‌గిరి ఎస్‌డీపీవో దివ్యజ్యోతి దళై, డిప్యూటీ కలెక్టర్ దీప్తి రంజన్ సాహు ఉన్నారు.


