రాయగడ: విద్యార్థి దశ నుండే సేవా దృక్పథంతో ముందుకు వెళ్లాలని స్థానిక అటానమస్ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ సరస్వతి రాయ్ అన్నారు. బుధవారం కళాశాలలొ యువరెడ్ క్రాస్, ఎన్‌సీసీ, జాతీయ సేవా సంస్థలు సంయుక్తంగా నిర్వహించిన రక్తదాన శిబిరాన్ని ఆమె ముఖ్యఅతిథిగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. విద్యార్థులు సేవా కార్యక్రమాల్లో పాల్గొనాలని హితవు పలికారు. రక్తదానం ప్రాణదానంతో సమానమని అన్నారు. ఇటువంటి కార్యక్రమాల్లో విద్యార్థులు స్వ చ్ఛందంగా పాల్గొని తమ సేవా భావాన్ని చాటుకోవాలని సూచించారు. ఈ సందర్భంగా నిర్వహించిన రక్తదాన శిబిరంలో 23 యూనిట్ల రక్తాన్ని సేకరించారు. స్థానిక ప్రభుత్వ ఆస్పత్రి వైద్య సిబ్బంది సహకారంతో కార్యక్రమాన్ని నిర్వహించారు. అనంతరం రక్తదాతలకు ప్రశంసా పత్రాలను అందించారు.


