పర్లాకిమిడి: ఒడియా భాషా, సాహిత్యం, సాంస్కృతిక శాఖ ఆదేశాల మేరకు అన్ని జిల్లాల్లో ఒడియా దివాస్ పక్షోత్సవాలు జరుపుకుంటున్న సందర్భంగా స్థానిక కలెక్టరేట్‌లో శుక్రవారం కలెక్టరేట్ మినీస్టీరియన్ సిబ్బందితో జిల్లా పరిషత్ కార్యనిర్వాహణ అధికారి, సీడీఓ దయామయ పాఢి అధ్యక్షతన సంప్రదాయ వస్త్రధారణ కార్యక్రమం జరిగింది.
జిల్లా సాంస్కృతిక శాఖ అధికారి కుమారీ అర్చనా మంగరాజ్, జిల్లా శిశు సంరక్షణ అధికారి అరుణ్ కుమార్ త్రిపాఠి, జిల్లా సామాజిక సురక్షా అధికారి ఉత్సర్‌గీతా బోడోరయితో, డిప్యూటీ కలెక్టర్ జగన్నాథ పాఢి, ఉత్కళ బాలాశ్రమం ఉద్యోగులు సంప్రదాయ వస్త్రధారణలో కనిపించారు. గజపతి జిల్లాలో అన్ని ప్రభుత్వ విభాగాల అధికారులు సిబ్బంది ఒడియా సంప్రదాయ వస్త్రధారణలో మీడియాకు ఫోజులిచ్చారు. ఏప్రిల్ ఒకటి నుంచి మహాబిషువ సంక్రాంతి 14తేదీ వరకూ రోజుకో కార్యక్రమం చేపడతామని జిల్లా సాంస్కృతిక శాఖఅధికారి అర్చనా మంగరాజ్ తెలియజేశారు.


