ఘనంగా పాఠశాల వార్షికోత్సవం | - | Sakshi
Sakshi News home page

ఘనంగా పాఠశాల వార్షికోత్సవం

Mar 26 2026 7:36 AM | Updated on Mar 26 2026 7:36 AM

జయపురం: నేటి బాలల నవ్వులే బావి భారత రత్నాలని పలువురు వక్తలు అన్నారు. స్థానిక పాయిక సాహిలో ఉన్న సరస్వతీ బాల మందిర ప్రాంగణంలో ఆ పాఠశాల వార్షికోత్సవం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమాన్ని విశ్రాంత ప్రధాన ఉపాధ్యాయులు హరిహర కరసుధా పట్నాయక్‌ ముఖ్య అతిథిగా, జయపురం బ్లాక్‌ ఎడ్యుకేషన్‌ విభాగ అధికారి చందన కుమార్‌ నాయక్‌ గౌరవ అతిథిగా హాజరయ్యారు. నేటి చిన్నారులకు క్రమశిక్షణతో కూడిన గుణాత్మక విద్య అందించి ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దాలన్నారు. సిఆర్‌సిసి రుద్ర ప్రసన్న పాణిగ్రహి, రామేశ్వర పండా, విజయలక్ష్మీ స్వైన్‌ ప్రసంగించారు. విజ్ఞాన ప్రదర్శనలు, మహానుబావుల చిత్రపటాలు, వివిధ రకాల పువ్వులు, ఔషధ మొక్కలు, ఆహార పదార్థాలు, ఆయుధాలు, వివిధ రకాల ధాన్యాలు, కొలతల పరికరాలు, హస్తకళల పరికరాలను ప్రదర్శించారు. బాలబాలికలకు పాటలు, నృత్యం, కథలు, కవితలు, వ్యాసరచన, వక్తృత్వ పోటీలు నిర్వహించారు, జయపురం ప్రముఖులు ఎం.డి షరీఫ్‌, పద్మ చరణ్‌, పద్మిణీ పాడీ, సుస్మితా మహంతి, ఉదయ శంకర జానీ, గోపాల్‌ సామంతరాయ్‌, రామనాథ్‌ త్రిపాఠీ, కిశోర్‌ త్రిపాఠీ, రాధామోహన్‌ పండా, ధిరెన్‌ మోహన్‌ పట్నాయక్‌, సుధాకర పట్నాయక్‌, పాఠశాల కార్యదర్శి అనూప్‌ కుమార్‌ సామంతరాయ్‌, కార్యదర్శి నిరంజన్‌ పాణిగ్రహి, పాఠశాల డైరెక్టర్‌ రితాలీ సాహు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement