● పెరిగిన దిగుబడి.. తగ్గిన అమ్మకాలు ● చెల్లని టమాటాను సాయంత్రం పూట పారబోస్తున్న వ్యాపారులు
శ్రీకాకుళం:
జిల్లా కేంద్రంలో పలుచోట్ల టమాటాలను వ్యాపారులు రోడ్డుపైనే పారబోశారు. కొన్ని రోజులుగా టమాటా ధర భారీగా పతనమైంది. హోల్‌సేల్‌లో 25 కిలోల ట్రే రూ.80 నుంచి రూ. 100కు విక్రయిస్తున్నారు. రిటైల్ మూడు కేజీలు రూ.20 చొప్పున అమ్ముతున్నారు. రోజురోజుకు దిగుబడి పెరుగుతుండగా, అమ్మకాలు తగ్గుతుండడంతో వ్యాపారులు చెల్లని టమాటాలను సాయంత్రంపూట రోడ్లపై పడేసి వెళుతుండగా వాటిని పశువులు తింటున్నాయి. ఐదు నెలల క్రితం 25 కేజీల టమాటా ట్రే రూ.1600 వరకు ధర పలికింది. ఆ సీజన్‌లో జిల్లాలో పంట ఉండ దు. ఇతర ప్రాంతాల నుంచి దిగుమతి చేసుకుంటూ ఉండేవారు. ఇప్పుడు కూడా ఇతర ప్రాంతా ల నుంచి దిగుమతి అవుతున్నప్పటికీ జిల్లాలోనే పంట ఉండడంతో ఇవన్నీ అమ్మకాలు కాక రోడ్లపై పడేయాల్సిన పరిస్థితి ఏర్పడింది.


