జయపురం: జయపురం సబ్‌డివిజన్ కొట్‌పాడ్ నోటీఫైడ్ ఏరియ కౌన్సిల్ (ఎన్‌ఏసీ) పరిధి హాట్‌పొదర్‌లో కొత్తగా నిర్మించిన షాపింగ్ కాంప్లెక్స్‌ను కొట్‌పాడ్ శాసనసభు్యు రూపు భొత్ర బుధవారం ప్రారంభించారు. రూ. 30 లక్షల వ్యయంతో వీటిని నిర్మించారు. ఈ సందర్భంగా రూపు భొత్ర మాట్లాడుతూ.. నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. ఇటువంటి స్టాల్స్ నిర్మించి నిరుద్య్గో యువతకు సమకూర్చుతే వ్యాపారాలు చేసుకొని స్వయం ఉపాధి పొందగలరన్నారు. కొట్‌పాడ్ నోటిఫైడ్ ఏరియా పరిధిలోని ఖాళీ స్థలాల్లో షాపింగ్ కాంప్లెక్స్ నిర్మించేందుకు రాష్ట్ర ప్రభుత్వానికి ప్రతిపాదించాలని కొట్‌పాడ్ ఎన్‌ఏసీ కార్యనిర్వాహక అధికారి కమలేసు మహంతి ఎమ్మెల్యేను కోరారు. అందుకు ఆయన అంగీకరించారు. కొట్‌పాడ్ ఎన్‌ఏసీ సర్వాంగ ఉన్నతికి పూర్తి సహకారం అందిస్తానని హామీ ఇచ్చారు. కొట్‌పాడ్ ఎన్‌ఏసీని మున్సిపాలిటీగా ప్రకటించాలని తాను ప్రభుత్వాన్ని కోరినట్లు వెల్లడించారు. కార్యక్రమంలో ఎన్‌ఏసీ చైర్మన్ ఎం.శంకరరావు, వైస్‌చైర్మన్ ఎం.సంతోషీ, కౌన్సిలర్లు పాల్గొన్నారు.


