ఆదిత్యుని సన్నిధిలో జస్టిస్‌ శేఖర్‌ | - | Sakshi
Sakshi News home page

ఆదిత్యుని సన్నిధిలో జస్టిస్‌ శేఖర్‌

Mar 26 2026 7:36 AM | Updated on Mar 26 2026 7:36 AM

శ్రీకాకుళం కల్చరల్‌: ప్రత్యక్షదైవం అరసవల్లి సూర్యనారాయణ స్వామివారిని బుధవారం ఉదయం హై కోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ టీసీడీ శేఖర్‌ దర్శించుకున్నారు. ఆయనకు ఆలయ ప్రధాన అర్చకులు ఇప్పిలి శంకర శర్మ, కార్యనిర్వహణాధికారి కేఎన్‌వీడీవీ ప్రసాద్‌ ఘన స్వాగతం పలికారు. ఆలయ అర్చకులు, వేద పండితులు వేద మంత్రాలతో ఆశీర్వదించారు. స్వామివారి ప్రసాదాలను అందజేశారు.

కూర్మనాథుని సన్నిధిలో...

గార: విష్ణుక్షేత్రం శ్రీకూర్మం కూర్మనాథున్ని రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తి టీసీడీ శేఖర్‌ బుధవారం దర్శించుకున్నారు. మూలవిరాట్‌ వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించారు. క్షేత్ర మహాత్యాన్ని ఆలయ ప్రధానార్చకులు సీహెచ్‌ సీతారామనృసింహాచార్యులు తెలియజేశారు. ఆయనతో పాటు జిల్లా న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి కె.హరిబాబు, ఆలయ ఈవో టి.వాసుదేవరావు, తహసీల్దార్‌ ఎం.చక్రవర్తి తదితరులు ఉన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement