ఇరాన్ యుద్ధం నేపథ్యంలో కమర్షియల్ గ్యాస్ సరఫరా నిలిచిపోవడంతో జిల్లా కేంద్రంలో హోటళ్లు, టిఫిన్ షాపులు ఒక్కొక్కటిగా మూతపడుతున్నాయి. కొందరు కట్టెల పొయ్యిపై నెట్టుకొస్తున్నా ఒకటి రెండు రోజుల తర్వాత ఇక తమ వల్లకాదంటూ చేతులెత్తేస్తున్నారు. మరోవైపు అధికారులు మాత్రం గ్యాస్ కొరత లేదంటూ ఆర్భాటపు ప్రకటనలు గుప్పిస్తుండటం పట్ల హోటల్ నిర్వాహకులు మండిపడుతున్నారు. – సాక్షి ఫొటోగ్రాఫర్, శ్రీకాకుళం
మూతపడిన అమ్మా మెస్
తాత్కాలికంగా సెలవు అంటూ బోర్డు


