● రూ.లక్షన్నర నగదు మాయం
● అవలింగి గ్రామంలో ఘటన
సారవకోట: అవలింగి గ్రామంలో ముద్దాడ గౌరినాయుడు ఇంట్లో భారీ చోరీ జరిగింది. కప్ బోర్డులో దాచిన 23 తులాల బంగారం, లక్షన్నర నగదు మాయమైంది. బాధితుడు తెలిపిన వివరాల ప్రకా రం.. గౌరినాయుడు తన తల్లి హేమలత, భార్య పావని, ఆరు నెలల పాపతో కలిసి అవలింగిలో సొంతింట్లో నివాసం ఉంటున్నాడు. ఓ ప్రైవేట్ కంపెనీలో పనిచేస్తూ వారానికి ఒకటి రెండు రోజులు స్వగ్రామానికి వచ్చి పొలం పనులు చూసుకుని వెళ్తుంటాడు. శనివారం సాయంత్రం తల్లి హేమలత ఆమె బంధువుల ఇంటికి వెళ్లగా, గౌరినాయుడు భార్య పావని చంటి బిడ్డతో ఇంట్లోనే ఉంది. ఆదివారం పావని తన బిడ్డను చూస్తుండమని పక్కింట్లో ఉండే ఓ బాలుడికి చెప్పి దుస్తులు ఉతికేందుకు సమీపంలోని కాలువ వద్దకు వెళ్లి వచ్చేసింది. సోమ వారం అత్తయ్య హేమలత క్యాంపు నుంచి తిరిగి వచ్చి అదే రోజు సాయంత్రం బ్యాంకు ఖాతాలో జమైన రూ.4వేలు విత్‌డ్రా చేసి కప్‌బోర్డులో పెట్టేందుకు చూడగా, ఆ కప్‌బోర్డులో ఉండాల్సిన 23 తులాల బంగారు నగలు, ఇంటి పనుల కోసం తెచ్చిన రూ.లక్షన్నర నగదు కనిపించలేదు. దీంతో కుమారుడు గౌరినాయుడుకు సమాచారమివ్వగా ఆయన వచ్చి మంగళవారం సారవకోట పోలీసుల కు సమాచారం అందించారు. క్లూస్‌టీం ఘటనా స్థలాన్ని పరిశీలించి వేలిముద్రలు సేకరించారు.


