జయపురం:
జాతీయ మానవ హక్కుల కమిషన్ స్పెషల్ న్యూఢిల్లీ ప్రత్యేక మానిటర్ ప్రొఫెసర్ కనైయ్ త్రిపాఠీ సోమవారం స్థానిక విక్రమదేవ్ విశ్వవిద్యాలయాన్ని సందర్శించారు. ఆయనకు విశ్వ విద్యాలయ సిబ్బంది ఎన్‌సీసీ క్యాడర్ ఘనంగా స్వాగతం పలికింది. క్యాడెట్ల ప్రతిభను చూసి ప్రశంసించారు. సైబర్ నేరాలు, మానవ హక్కుల ఉల్లంఘనపై అప్రమత్తంగా ఉండాలన్నారు. ఈ సందర్భంగా వర్సిటీ అధికారులతో చర్చించారు. బాలికల హాస్టల్ వద్ద కామన్ టాయిలెట్లలో వెండింగ్ మిషన్ల ద్వారా శానిటరీ ప్యాడ్లు ఉండేలా ఏర్పాటుచేయాలని కోరారు. ఉద్యోగులకు ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లు, తదితర విషయాలలో న్యాయం జరిగేలా చూడాలని, పీఎంజీ 4 కింద హాస్టల్ సదుపాయాలు మెరుగు పరచాలని ఆయన యూనివర్శిటీ రిజిస్ట్రార్ మహే్‌ష్ చంద్ర నాయక్‌తో జరిపిన చర్చల్లో సూచించారు.


