15 కిలోల గంజాయి పట్టివేత | - | Sakshi
Sakshi News home page

15 కిలోల గంజాయి పట్టివేత

Mar 24 2026 6:56 AM | Updated on Mar 24 2026 6:56 AM

● ఒకరి అరెస్టు

మల్కన్‌గిరి: మల్కన్‌గిరి జిల్లా బలిమెల పోలీసులు సోమవారం మధ్యాహ్నం బలిమెల –చిత్రకొండ ముఖ్య రహదారిలో పెట్రోలింగ్‌ నిర్వహిస్తున్నారు. ఈ సమయంలో ఓ సంచి పట్టుకొని బస్సు కోసం ఓ వ్యక్తి అనుమానాస్పదంగా నిలబడి ఉన్నారు. దీంతో అతన్ని అదుపులోకి తీసుకొని తనిఖీ చేయగా.. గంజాయి వెలుగు చూసింది. వెంటనే గంజాయిని స్వాధీనం చేసుకొని అతన్ని అరెస్టు చేసి పోలీసుస్టేషన్‌కు తరలించారు. ఐఐసీ దీరాన్‌ పట్నాయక్‌ నిందితుడిని విచారింగా.. చిత్రకొండలో గంజాయి కొనుగోలు చేసి బీహార్‌కు తరలిస్తున్నట్టు నిందితుడి అంగీకరించారు. స్వాధీనం చేసుకున్న గంజాయిని తూకం వేయగా 15 కిలోలు ఉంది. దీని విలువ సుమారు లక్ష రూపాయలు ఉంటుందని ఐఐసీ దీరాన్‌ తెలిపారు. నిందితుడు బీహార్‌ రాష్ట్రం ససారాం జిల్లాకు చెందిన కృష్ణ చౌరాసియాగా గుర్తించారు. అతని వద్ద నుంచి గంజాయితోపాటు సెలల్‌ఫోన్‌, ఆధార్‌ కార్డును స్వాధీనం చేసుకొని కేసు నమోదు చేసి కోర్టుకు తరలిస్తామన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement