కొరాపుట్: మద్యం మత్తులో తుపాకీతో కాల్పులు జరపడంతో యువకుని పరిస్థితి విషమంగా మారింది. సోమవారం నబరంగ్‌పూర్ జిల్లా జొరిగాం సమితి ఏకంపారా గ్రామానికి చెందిన బిక్షయా సబర్ అనే యువకుడు అతిగా మద్యం సేవించి కుసుంబల్ గ్రామానికి వచ్చి గ్రామస్తులతో గొడవ పడ్డాడు. గ్రామస్తులు నచ్చజెప్పి అతనిని పంపించేశారు. అనంతరం బిక్షయా సంబర్ తన వద్ద ఉన్న నాటు తుపాకీతో తిరిగి గ్రామానికి వచ్చాడు. గ్రామం మధ్యలో మాట్లాడుతున్న పాండు జానీ అనే వ్యక్తి పై వెనుక నుంచి తుపాకీ తో కాల్పులకు దిగాడు. దీంతో పాండు కుప్పకూలిపోయాడు. వెంటనే గ్రామస్తులు జొరిగాం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా పరిస్థితి విషమించడంతో ఉమ్మర్‌కోట్ ప్రభుత్వ ఆస్పత్రికి అనంతరం నబరంగ్‌పూర్ జిల్లా కేంద్రాస్పత్రికి తరలించారు. వైద్యులు వెంటనే కొరాపుట్ జిల్లా కేంద్రంలో ప్రభుత్వ సాహిద్ లక్ష్మణ్ నాయక్ వైద్య కళాశాలకి తరలించారు. బాధితుడికి రూ.5 చోట్ల తుపాకీ తూటా గాయాలయ్యాయని, ప్రభుత్వ వైద్యురాలు సుస్మితా నాయక్ ప్రకటించారు. అందులో ఒక బులెట్ వెన్నెముకకి తగిలిందని పేర్కొన్నారు. జొరిగాం పోలీసులు కేసు నమోదు చేసి నిందితుడి కోసం గాలిస్తున్నారు.


