కులాంతర వివాహం చేసుకున్నందుకు శిరో మండనం | - | Sakshi
Sakshi News home page

కులాంతర వివాహం చేసుకున్నందుకు శిరో మండనం

Mar 24 2026 6:56 AM | Updated on Mar 24 2026 6:56 AM

కొరాపుట్‌: కులాంతర వివాహం చేసుకున్నందుకు శిరో మండన శిక్ష అనుభవించాల్సి వచ్చింది. సోమ వారం కొరాపుట్‌ జిల్లా కేంద్రానికి సమీపంలో కొరాపుట్‌ సదర్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని అటవీ ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. జయపూర్‌ పట్టణంలో ఇద్దరు యువతీ యువకులు ప్రేమ వివాహం చేసుకున్నారు. ఈ వివాహాన్ని యువకులు కులస్తులు వ్యతిరేకించారు. అనంతరం కుల పెద్దలు పంచాయతీ పెట్టి యువకుడు శిరో మండనం చేసుకోవాలని, కులస్తులకు మాంసాహార భోజనం పెట్టాలని, కుల సంఘానికి రూ.90వేలు జరిమానా చెల్లించాలని ఆదేశించారు. దీంతో ఆ యువకుడు షరతులు అంగీరిస్తూ వారు చెప్పిన ఆదేశాలు పాటించారు. ఈ దృశ్యాలు సోషల్‌ మీడియాలో వైరల్‌ కావడంతో సంబంధిత వ్యక్తులు అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement