మల్కన్‌గిరి: విద్యాశాఖ ఆదేశాల మేరకు మల్కభ్గిరి ముండగూడ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో సోమవారం జిల్లా కలెక్టర్ ప్రధమేశ్ అర్వింద్ రాజశిర్కే, ఇతర ఉన్నతాధికారులు విద్యకు కొత్త అధ్యాయాన్ని సామూహిక అక్షరభ్యాసం కర్యక్రమాన్ని ప్రారంభించారు. చిన్నారులకు చాక్లెట్లు, పూలు ఇచ్చి ఆహ్వానించారు. కొత్తగా స్కూల్‌లో చేరే చిన్నారులతో అక్షరాభ్యాసం చేయించారు. చిన్నారుల తల్లిదండ్రులతో కలెక్టర్ మాట్లాడారు. చిన్నారుల భవిషత్ గూర్చి అవగహన కల్పించారు. ముఖ్యమంత్రి సంతకం చేసిన ప్రత్యేక ఆహ్వాన పత్రాలను తల్లిదండ్రులకు అందజేశారు. ఏప్రిల్ 2వ తేదీన జిల్లాలో అన్ని పాఠశాలల్లో అక్షరభ్యాస కార్యక్రమాన్ని నిర్వహిస్తామన్నారు. ఎస్పీ వినోద్ పటేల్, జిల్లా విద్యశాఖ అధికారి చిత్తరంజాన్ పాణిగ్రాహి, జిల్లా అభివృద్ధిశాఖ అధికారి దశరాథి సరాబు, జిల్లా సబ్ కలెక్టర్ దుర్యోధన్ బోయి, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.


