● హైటెక్ గ్రూప్ వ్యవస్థాపక చైర్మన్ డాక్టర్ తిరుపతి పాణిగ్రాహి
భువనేశ్వర్: హైటెక్ మెడికల్ కాలేజీ ప్రాంగణంలో ‘కుహుడి’ నాటకాన్ని సోమవారం ప్రదర్శించారు. ప్రముఖ నాటక సంస్థ విద్యా కనక సజన సంస్థ కళాకారులు ప్రదర్శించిన ఈ నాటకం అందరినీ ఆకట్టుకుంది. హైటెక్ గ్రూప్ వ్యవస్థాపక చైర్మన్ డాక్టర్ తిరుపతి పాణిగ్రాహి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. సామాజిక సందేశం ఉన్న ఇలాంటి నాటకాలు రాబోయే తరానికి స్ఫూర్తిదాయకంగా, ఉపయోగకరంగా ఉంటాయని అభిప్రాయపడ్డారు. తన జీవితంలో జరిగిన కొన్ని దురదృష్టకర సంఘటనలను ఆయన వివరించారు. పిల్లలు ఎంత ఎత్తుకు ఎదిగినా తల్లిదండ్రుల త్యాగాలను మర్చిపోకూడదన్నారు. ఎందుకంటే వారే తొలి దైవమని అన్నారు. ఒక విరామ ఉద్యోగికి తన సొంత ఇల్లు, కుటుంబం భరించలేని భారంగా మారుతున్న వర్ధమాన సమాజానికి ఈ నాటకం చక్కని మానవీయ సందేశం ప్రసారం చేసిందని నటీనటులు, సాంకేతిక, ఇతర వర్గాల కృషిని కొనియాడారు. ఈ సందర్భంగా కళాకారులను హైటెక్ వ్యవస్థాపక అధ్యక్షుడు డాక్టర్ తిరుపతి పాణిగ్రాహిని ప్రత్యేకంగా సత్కరించి అభినందించారు.


