‘అణగారిన వర్గాల గాథలే కవితలు’ | - | Sakshi
Sakshi News home page

‘అణగారిన వర్గాల గాథలే కవితలు’

Mar 23 2026 9:11 AM | Updated on Mar 23 2026 9:11 AM

జయపురం: కవితలు అణగారిన వర్గాల బాధలను గాథలను ప్రతిబింబిస్తాయని ప్రముఖ కవి డాక్టర్‌ బాసు దేవ్‌ సునాని అన్నారు. కవి బలరాం పూజారి 52వ జయంతి సందర్భంగా ఆదివారం స్థానిక ఎస్‌ఆర్‌ మాల్‌ కన్వెన్షన్‌ హాల్‌లో నిర్వహించిన సమావేశంలో బాసుదేవ్‌ సునానీ ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. కార్యక్రమంలో ఆయన ప్రసంగిస్తూ బలరాం పూజారి ప్రజా కవి అని ఆయన కవితలు ప్రజలను చైతన్యపరిచేవిగా ఉంటున్నాయన్నారు. కార్యక్రమంలో గౌరవ అతిథిగా ప్రముఖ పరిశోధకులు డాక్టర్‌ పరమేశ్వర ముంఢ, కవయిత్రి డాక్టర్‌ ప్రీతి ధారా సామల్‌, కవి బలరామ్‌ పూజారి సాహిత్య ప్రమాణాలను విశ్లేసిస్తూ ప్రసంగించారు. ప్రముఖ కవి కార్యక్రమ పరిచాలకులు ధర్మ రాజ్‌ మఝి అధ్యక్షతన జరిగిన బలరాం పూజారి జయంతి వేడుకల్లో కవి చక్రపాణిని సత్కరించారు. ఈ సందర్భంగా కవి బలరాం పూజారికి అంకితంగా ‘కవి కొరాపుట్‌’ పేరుతో ప్రత్యేక కవి సమ్మేళనం నిర్వహించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement