రాయగడ: జిల్లాలోని బిసంకటక్ సమితి చాటికోన వద్ద ఆదివారం నాడు జరిగిన రోడ్డు ప్రమాదంలొ ఇద్దరు దుర్మరణం పాలయ్యారు. మృతుల్లో ఒక యువతి, ఒక యువకుడు ఉన్నారు. కాశీపూర్ సమితిలోని టికిరి ప్రాంతానికి చెందిన ఆకాష్ నాయక్ (32), రాయగడకు చెందిన పూనమ్ (21)గా గుర్తించారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని మృతదేహాలను పొస్టుమార్టం కోసం జిల్లా కేంద్రాస్పత్రికి తరలించారు. పోలీసులు తెలియజేసిన వివరాల ప్రకారం.. ఆదివారం నాడు పూనమ్, ఆకాష్‌లు బైక్‌పై బిసంకటక్ వైపు వెళ్తుండగా బైకు అదుపు తప్పి కిందపడిపోయారు. దీంతో బైకు వెనుక కూర్చున్న ఆమె కొద్ది దూరం ఎగిరి పడిపొగా బైకు డ్రైవ్ చేస్తున్న ఆకాష్ కిందపడి తీవ్రగాయాలకు గురయ్యాడు. అనంతరం వారు సంఘటన స్థలం వద్దే మృతి చెందారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.


