పర్లాకిమిడి: హరియాణ రాజధాని చండీగఢ్‌లో ఈనెల 20 నుంచి 22వ తేదీ వరకూ జరిగిన మాస్టర్ గేమ్స్‌లో పర్లాకిమిడికి చెందిన విశ్రాంత అబ్కారీ శాఖ ఉద్యోగి కిశోర్‌చంద్ర రథ్ సత్తాచాటారు. వందమీటర్ల పరుగు పందెంలో సిల్వర్, 200 మీటర్ల పరుగు పందెంలో బ్రాంజ్, ట్రిపుల్ జంప్‌లో ద్వితీయ బహుమతిగా సిల్వర్ పతకాలు సాధించాడు. ఈ గెలుపుతో కిశోర్ చంద్ర రథ్ వచ్చే వరల్డ్ మాస్టర్ గేమ్స్‌లో పాల్గోనేందుకు ఆర్హత సాధించాడు. గతంలో జాతీయ, అంతర్జాతీయ స్థాయి ఆథెలెటిక్స్‌లో అనేక బహుమతులు సాధించాడు. ఆయన గెలుపుపై గజపతి జిల్లాలోని క్రీడాకారులు, జిల్లా స్పోర్ట్స్ అధికారి త్రినాథసాహు హర్షం వ్యక్తం చేశారు.


