జయపురం: దివ్యాంగు పింఛన్‌ను పునరుద్ధరించి ఆదుకోవాలి ఆదివాసీ మహిళ తులసీ బారిక్ కోరుతున్నారు. జయపురం సబ్‌డివిజన్ బొయిపరిగుడ సమితి దసమంతపూర్ గ్రామ పంచాయితీ మహంతపుట్(రామ గుడ)గ్రామానికి చెందిన తులసి బారిక్ దివ్యాంగురాలు. ఆమె ఎడమ కాలు ముడుచుకు పోవడంతో నడవలేరు. వైద్య విభాగం అధికారులు ఆమెకు దివ్యాంగ ధ్రువ పత్రం మంజూరు చేయడంతో కొన్నేళ్లుగా దివ్యాంగు పింఛన్ ప్రతినెల వచ్చేది. అయితే గత ఏడాది నుంచి పింఛన్‌ను నిలిపివేశారు. తన పింఛన్‌ను పునరుద్ధరించాలని కోరుతూ ఆమె పంచాయతీ, సమితి అధికారులు కలుస్తూ కోరుతున్నారు. అయినప్పటికీ స్పందించడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికై నా అధికారులు స్పందించి దివ్యాంగు పింఛన్‌ను పునరుద్ధరించి ఆదుకోవాలని తులసి బారిక్ వేడుకుంటున్నారు.


