వసంత నవరాత్రులు ప్రారంభం | - | Sakshi
Sakshi News home page

వసంత నవరాత్రులు ప్రారంభం

Mar 21 2026 4:54 AM | Updated on Mar 21 2026 4:54 AM

భువనేశ్వర్‌: జట్నీ కుదియారి గ్రామ దేవత జగులాయి మాత వసంత నవరాత్రి ఉత్సవాలు ప్రారంభం అయ్యాయి. ఈ నెల 27 వరకు ఉత్సవాలు కొనసాగుతాయి. గ్రామ పరిక్రమ అనంతరం రాజ పుష్కరణిలో సేకరించిన పవిత్ర జలంతో నింపిన పూర్ణ కలశాలను ఊరేగింపుగా తరలించి ఉత్సవ ప్రాంగణంలో ప్రతిష్టించారు. ఉత్సవాల్లో భాగంగా సాయంత్రం పూట మహా స్నానం ఆచరించి అమ్మ వారిని రోజుకో అలంకరణ చేస్తారు. తొలి రోజున దేవి శైల పుత్రి అలంకారంలో అర్ధరాత్రి వరకు భక్తులకు దర్శనం ఇచ్చారు. షోడశోపచార పూజలు, శప్త సతీ చండీ ఆహుతి, హారతి, పుష్పాంజలి సమర్పించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement