పర్లాకిమిడి: నోటిని జాగ్రత్తగా ఉంచుకోవాలని వక్కలు అన్నారు.సెంచూరియన్ వర్సిటీ క్యాంపస్ ఆడిటోరియంలో శుక్రవారం ప్రపంచ నోటి ఆరోగ్య దినోత్సవాన్ని స్కూల్ ఆఫ్ నర్సింగ్, డాక్టర్ సల్లాన శరత్ కుమార్ ఆధ్వర్యంలో జరుపుకున్నారు. పంటి సమస్యలు, నోటి దుర్వాసన, సాధారణ నోటి సమస్యలను ముందుగానే కనిపెట్టి ముందుగానే చికిత్స తీసుకోవాలని పంటి నిపుణులు డాక్టర్ సల్లాన శరత్‌కుమార్ (పాతపట్నం) అన్నారు. నోటిలో పుచ్చిపళ్లు, నోటి దుర్వాసన వల్ల వస్తుందని వాటిని వెంటనే డాక్టర్ వద్ద పరీక్షించుకోవాలని అన్నారు. శిబిరంలో 122 మంది నర్సింగ్ విద్యార్థులు, నర్సింగ్ ఫ్యాకల్టీ శుభశ్రీ పాణిగ్రాహి, కె.లహరి, మిలాన్ కుమార్ ముదులి పాల్గొన్నారు.


