కొరాపుట్: కేంద్ర బలగాలలో ప్రధానమైన సీఆర్పీఎఫ్ వ్యవస్థాపక దినోత్సవం ఘనంగా జరిగింది. గురువారం నబరంగ్‌పూర్ జిల్లా కేంద్రంలోని జానకీనగర్‌లో సీఆర్పీఎఫ్ 12వ బెటాలియన్ కేంద్రంలో 87వ వ్యవస్థాపక దినోత్సవం నిర్వహించారు. కమాండెంట్ నంద కిశోర్ కుమార్ ప్రసాద్ గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం అమర జవానులకు నివాళులర్పించారు. దేశ తొలి ఉప ప్రధాన మంత్రి సర్దార్ వల్లభాయ్ పటేల్ చొరవతో ఈ దళం ఏర్పాటైందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఐఐసీ కేకే సింగ్, డిప్యూటీ కమాండెంట్ రాజీవ్ కుమార్, ఏసీ అనీల్ కుమార్, ఇన్‌స్పెక్టర్ సాహు, ఇతర అధికారులు పాల్గొన్నారు.


