‘కళ’హండి కట్టప్ప | - | Sakshi
Sakshi News home page

‘కళ’హండి కట్టప్ప

Mar 20 2026 7:54 AM | Updated on Mar 20 2026 7:54 AM

ప్రదర్శనల్లో అలరిస్తున్న సునీల్‌ మహానంద

నటుడిగా, ఫోక్‌ డ్యాన్సర్‌గా, గాయకునిగా రాణింపు

కేరమ్స్‌లో నేషనల్‌ ప్లేయర్‌గా గుర్తింపు

కలహండి కట్టప్ప వేషధారణలో సునీల్‌

మహానంద

కంచిలి: ఉత్తరాంధ్రలో ఎక్కడ జాతర జరిగినా విచిత్ర వేషధారణతో ఓ వ్యక్తి కనిపిస్తాడు. ఆడు తూ, ఆట పట్టిస్తూ హుషారుగా అందరి దృష్టిని తన వైపు తిప్పుకుంటాడు. భారీ కాయంతో జాతర కు సెంటర్‌ఆఫ్‌ అట్రాక్షన్‌గా మారుతాడు. జనం అతడిని ‘కలహండి కట్టప్ప’ అని ముద్దుగా పిలుచుకుంటారు. ఈ వేషధారణ హాస్యానికే అయినా.. అతడు జానపద గీతాలను అద్భుతంగా పాడగలడు. అంతకుమించి ఆటను రక్తి కట్టించగలడు. జాతీయ స్థాయి కేరమ్స్‌ పోటీల్లోనూ రాణించాడు. పుట్టుక ఒడిశాలోని కలహండే అయినా మన తెలుగు వారికి అందులోనూ సిక్కోలు వారికి చిర పరిచితుడు. ఈ కట్టప్ప అసలు పేరు సునీల్‌ మహానంద. స్వస్థలం ఒడిశా రాష్ట్రం.

ఇటీవల కంచిలిలో జరిగిన జాతరలో ఈ కలహండి కట్టప్ప తళుక్కున మెరిశాడు. ఓ 20 మందిని వెంటబెట్టుకుని 350 కిలోమీటర్లు ప్రయాణించి కంచిలిలో ప్రదర్శన ఇచ్చాడు. తెలుగు ప్రాంతాల్లో ఎక్కడ జాతర జరిగినా అతడు బండి కట్టి రావాల్సిందే. సునీల్‌ మహానంద తన గురువు ప్రమోద్‌కుమార్‌ నాయక్‌ వద్ద నాటక రంగంలో శిక్షణ పొందారు. 15 ఏళ్లుగా ఈ వృత్తినే ఎంచుకొని ప్రయా ణం కొనసాగిస్తున్నారు. ఇతడు నటనతోపాటు నేషనల్‌ ఫోక్‌ డ్యాన్సర్‌గాను, గాయకునిగా కూడా రాణిస్తున్నారు. మరోవైపు కేరమ్స్‌లో నేషనల్‌ ప్లేయర్‌గా కూడా రాణిస్తున్నారు. ఇతని స్వగ్రామం కలహండి జిల్లా భవానీపట్నం. కలహండి కట్టప్ప ప్రదర్శనను సంబర మహోత్సవాల్లో స్ట్రీట్‌ షోలతోపాటు, స్టేజి ప్రదర్శనలు కూడా ఇస్తారు. 20 మంది బృంద సభ్యులతో ఈ ప్రదర్శనలిస్తున్నారు. ఇప్పటి వరకు ఒడిశా రాష్ట్రంలో వివిధ జిల్లాల్లోను, పక్క రాష్ట్రాల్లో ప్రదర్శనలిచ్చారు.

సినిమాల్లోనూ రాణింపు

సునీల్‌ మహానంద వీధి ప్రదర్శనలతోపాటు స్టేజి షోలను చేస్తున్నారు. ప్రస్తుతం వీటితోపాటు ఒడి యా సినిమాల్లో కూడా నటిస్తున్నారు. ఇప్పటి వరకు నాలుగు సినిమాలు చేశారు. అలాగే షార్ట్స్‌ ఫిల్మ్‌లను కూడా చేస్తున్నారు. సమాజానికి అవసరమైన మెసేజ్‌ ఇచ్చే షార్ట్‌ ఫిల్మ్‌లను కూడా తీస్తుంటారు. వీటితోపాటు ‘నృత్యగాన సాంస్కృతిక అనుస్టాన్‌’ పేరుతో భవానీపట్నంలో ఫోక్‌ డ్యాన్స్‌ అకాడమీని నిర్వహిస్తున్నారు. అదేవిధంగా ‘కలహండి కట్టప్ప’ అనే పేరుతో యూట్యూబ్‌ చానెల్‌ను కూడా నిర్వహిస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement