రాయగడ: స్థానిక రైతుల కాలనీలోని జెమ్స్ మిలీనియం పబ్లిక్ స్కూల్ మేనేజింగ్ డైరెక్టర్ తుబాటి రాము పేరిట అతని జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని బుధవారం ‘తుబాటి రాము చారిటబుల్ ట్రస్టు’ను ప్రారంభించారు. సమాజసేవతో పాటు అంకితభావంతో సేవా కార్యక్రమాలు నిర్వహించడమే ట్రస్టు ముఖ్య ఉద్దేశమని అధ్యక్షులు రాము తెలిపారు. అవసరమైన వారికి సహాయం చేయడం ద్వారా వారిలో మంచి మార్పును తీసకురావడమే లక్ష్యంగా పనిచేస్తామని అన్నారు. ప్రారంభోత్సవ కార్యక్రమంలో పబ్లిక్ స్కూల్ ప్రిన్సిపాల్ పతివాడ వనిత, ప్రముఖ సమాజ సేవకురాలు సుజాత, మహిళలు, అభిమానులు పాల్గొన్నారు.


