రాయగడ : జిల్లాలోని శేశిఖాల్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న వివిధ గ్రామాల్లో దోపిడీలు, దొంగతనాలు రోజురోజుకూ పెరుగుతున్నాయని గ్రామస్తులు భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. జంగిలి గ్రామంలో ఈ మేరకు పొలీస్ అవుట్ పోస్టు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. కొద్ది రోజులుగా జంగిలి గ్రామం ఆ పరిసర గ్రామాల్లో చోరీలు, దొంగతనాలు పెరిగిపోతుండడంతో యువకులు ప్రతి రోజూ రాత్రిళ్లు కర్రలు, ఇతర మారణాయుధాలు పట్టుకుని పహారా కాస్తున్నారు. కొద్ది రొజుల క్రితం గ్రామానికి చెందిన రమేష్ మండంగి తల్లి అప్పాలి మండంగి గ్రామం నుంచి ఏదో పనిమీద కొద్ది దూరం వెళ్లి తిరిగి వస్తున్న సమయంలో బైకుపై గుర్తు తెలియని దుండగులు ఆమైపె దాడి చేసి చెవిదుద్దులు దొంగిలించుకుపోయారు. ఇదే విషయమై శెశిఖాల్ పోలీస్ స్టేషన్‌లో బాధితులు ఫిర్యాదు చేశారు. అదే తరహా తరచూ దొపిడీలు జరుగుతున్నా పోలీసుల పెట్రొలింగ్ ఏమాత్రం లేకపొవడంతో భయాందోళనలకు గురైన గ్రామస్తులు అంతా కలసి సమావేశమయ్యారు. ప్రతి రోజూ దొంగల బెడద నుంచి గ్రామాన్ని కాపాడుకోవాలనే ఉద్దేశంతో బృందాలుగా ఏర్పడి రాత్రుళ్లు గ్రామ పొలిమేరలో కాపలా కాసేందుకు నిర్ణయించారు.


