సభలో ఎస్‌సీబీ సెగ | - | Sakshi
Sakshi News home page

సభలో ఎస్‌సీబీ సెగ

Mar 18 2026 7:38 AM | Updated on Mar 18 2026 7:38 AM

భువనేశ్వర్‌ : రాష్ట్ర శాసన సభలో కటక్‌ ఎస్‌సీబీ వైద్య బోధన ఆస్పత్రిలో సోమ వారం సంభవించిన అగ్ని ప్రమాదం సెగతో సభ వేడెక్కింది. ఈ విచారకర సంఘటనపై విపక్ష బిజూ జనతా దళ్‌, కాంగ్రెస్‌ పార్టీలు సభలో మంగళవారం గందరగోళం సృష్టించాయి. ఈ విచారకర సంఘటనపై నైతిక విలువలు పాటిస్తూ రాష్ట్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి డాక్టరు ముఖేష్‌ మహాలింగ్‌ పదవికి రాజీనామా చేయాలని ప్రధాన విపక్షం బీజేడీ డిమాండ్‌ చేసింది. ఎస్సీబీలో ఘోర అగ్ని ప్రమాదం సంభవించి 12 మంది ప్రాణాలు కోల్పోయిన విచారకర పరిస్థితుల్లో ఆరోగ్య శాఖ మంత్రి సభలో నవ్వుతూ వ్యంగ్య ప్రదర్శన చేస్తున్నారని విపక్షాలు వ్యాఖ్యానించాయి. ఎస్సీబీ వైద్య కళాశాలలో దారుణమైన ఆరోగ్య సేవల పరిస్థితి అడుగంటిపోయింది. ఐసీయూలో ఫైర్‌ ఎక్స్‌టింగ్విషర్లు పని చేయడం లేదు. ఈ ప్రతిష్టాత్మక వైద్య సంస్థ పట్ల రాష్ట్ర ప్రజల విశ్వాసం దెబ్బతింది. ఈ పరిస్థితుల దృష్ట్యా ఆరోగ్య శాఖ మంత్రి రాజీనామా చేయాలి. రాష్ట్రంలో ఆరోగ్య సేవలు మెరుగుపడే వరకు నిరసన కొనసాగుతుందని బీజేడీ హెచ్చరించింది. ఈ అంశంతో సభలో నిరవధికంగా గందరగోళం నెలకొనడంతో సభా కార్యకలాపాలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. సభని సాయంత్రం 4 గంటల వరకు నిరవధికంగా వాయిదా వేసినట్లు స్పీకరు సురమా పాఢి ప్రకటించారు.

ముగ్గురు కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు సస్పెండ్‌

భువనేశ్వర్‌: రాష్ట్రంలో జరిగిన రాజ్యసభ ఎన్నికల తుది ఫలితాలతో రాజకీయ శిబిరాల్లో సరికొత్త వాతావరణం నెలకొంది. ప్రధానంగా 4వ స్థానం ఫలితాల అంచనాలు బాహాటంగా చేయి దాటిపోవడంతో విపక్షాల శిబిరంలో వాతావరణం వేడెక్కింది. బిజూ జనతా దళ్‌, కాంగ్రెస్‌ ఓటర్లు క్రాస్‌ ఓటింగ్‌ చేసినట్లు ఆయా పార్టీల నాయకులు ప్రకటించారు. ఈ నేపథ్యంలో కాంగ్రెసు సభ్యులు సోఫియా ఫిర్దౌస్‌, రమేష్‌ చంద్ర జెనా, దాశరథి గోమాంగో సస్పెన్షన్‌ వేటుకు గురయ్యారు. ఒడిశా ప్రదేశ్‌ కాంగ్రెస్‌ కమిటీ పార్టీ నుంచి సస్పెండ్‌ చేసినట్లు అధికారికంగా ప్రకటించారు.

సోఫియా ఫిర్దౌస్‌ దాశరథి గోమాంగో రమేష్‌ చంద్ర జెనా

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement