భువనేశ్వర్: ఖుర్దా జిల్లా జట్నీ మున్సిపాలిటి కుదియారి ప్రాంతంలో దశ డోలా మేళ అత్యంత ఆనందోత్సాహాలతో జరిగింది. స్థానిక ఝాడేశ్వరి పూజా కమిటీ ఆధ్వర్యంలో అత్యంత వైభవంగా జరిగిన 39వ కుదియారి దశ డోలా మేళాలో హై టెక్ గ్రూప్ వ్యవస్థాపక చైర్మన్ డాక్టరు తిరుపతి పాణిగ్రాహి విశిష్ట అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన అభినందన వేదికపై ప్రముఖ గాయకుడు బాబుల్ సుప్రియ ప్రదర్శన సందర్శకులను విశేషంగా ఆకట్టుకుంది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతు దశ డోలా మేళా చారిత్రక, ఆధ్యాత్మిక ప్రాముఖ్యత రంగరించుకుని అన్ని వర్గాల ప్రజలను ఆకట్టుకుంటుందన్నారు. ఈ కార్యక్రమంలో హై టెక్ గ్రూప్ వ్యవస్థాపక చైర్మన్ డాక్టర్ తిరుపతి పాణిగ్రాహితో సుదర్శన్ సుందర్ రాయ్, విశ్వరంజన్ బొడొజెనా, ప్రముఖ రాజకీయ నాయకుడు, మాజీ ఎమ్మెల్యే సురేష్ కుమార్ రౌత్రాయ్ పాల్గొని కుదియారి దశ డోలా మేళా చరిత్రపై ప్రసంగించారు. ఈ మేళా యువతలో ఆధ్యాత్మిక భావనను పెంపొందించడానికి సహాయపడుతుందని వారు తెలిపారు.


