తాండవం | - | Sakshi
Sakshi News home page

తాండవం

Mar 16 2026 7:23 AM | Updated on Mar 16 2026 7:23 AM

కాలవైశాఖి.. తాండవం

న్యూస్‌రీల్‌

సోమవారం శ్రీ 16 శ్రీ మార్చి శ్రీ 2026
కాలవైశాఖి..

కంధమల్‌, మయూర్‌భంజ్‌ జిల్లాల్లో దుమ్ము రేపిన కాల వైశాఖి

భువనేశ్వర్‌:

రాష్ట్రంలో కంధమల్‌, మయూర్‌భంజ్‌ జిల్లాల్లో ఆదివారం సాయంత్రం కాలవైశాఖి దుమ్మురేపింది. దీని ప్రభావంతో కంధమల్‌ ప్రాంతంలో వడగళ్ల వాన కురిసింది. వడగళ్ల వాన చూసి చిన్నపిల్లలు, యువత ఉత్సాహంగా ఉన్నారు. ఘుముసర్‌ ఉదయగిరి ప్రాంతంలో వడగళ్ల వాన తీవ్ర ప్రభావం చూపింది. పెను గాలులు, ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురిసింది. కాల వైశాఖితో నేల రాలిన వడగళ్లు కాశ్మీర్‌ హిమపాతం తలపింపజేసిందని స్థానికులు తెలిపారు.

మయూర్‌భంజ్‌లో కాలవైశాఖి విధ్వంసం

మయూర్‌భంజ్‌ జిల్లా కరంజియా ప్రాంతంలో కాలవైశాఖి ప్రభావంతో తీవ్రమైన ఉరుములతో కూడిన వర్షం కురిసింది. బామన్‌ఘాటి ఉప జిల్లాలో పూరిళ్లు కుప్పకూలిపోవడంతో ఇద్దరు వ్యక్తులు మరణించారు. 10 మందికి పైగా గాయపడ్డారు. 70 కి పైబడి ఇళ్లు కుప్పకూలాయి, 10 కి పైగా విద్యుత్‌ స్తంభాలు విరిగిపోయాయి. గాలికి ఒక ఆటో 50 అడుగుల దూరం ఎగిరిపోయింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement