‘అగ్నివీర్‌’పై అవగాహన | - | Sakshi
Sakshi News home page

‘అగ్నివీర్‌’పై అవగాహన

Mar 16 2026 7:23 AM | Updated on Mar 16 2026 7:23 AM

‘అగ్నివీర్‌’పై అవగాహన

జయపురం: స్థానిక విక్రమదేవ్‌ విశ్వవిద్యాలయలో 15వ ఒడిశా బెటాలియన్‌ ఎన్‌సీసీ జయపురం తరఫున అగ్నివీర్‌ పథకంపై ఆదివారం అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఎన్‌సీసీ క్యాడెట్లు, యువత భారత సైన్యంలో చేరేందుకు కావాల్సిన అర్హతలు ఇతర అంశాలను అధికారులు వివరించారు. ఎన్‌సీసీ, సైన్యాధికారులు హాజరై క్యాడెట్లకు అగ్నివీర్‌ పథకంలో అర్హతలు, ఎంపిక ప్రక్రియ, శిక్షణ, భవిష్యత్‌ అవకాశాలను తెలియజేశారు. ఏఆర్వో గోపాలపూర్‌ నుంచి సుబేదార్‌ మేజర్‌ సంతోష్‌కుమార్‌, హవల్దార్‌ సుభాష్‌ ఘోష్‌, ఎంటీఎస్‌ సుధీర్‌కుమార్‌ రాణా, కొరాపుట్‌ జిల్లా నియామక కార్యాలయ అధికారి యుగల్‌ కిశోర్‌ కుశ్రాహే, సీవో లెఫ్ట్‌నెంట్‌ కర్నల్‌ ప్రీతి రంజన్‌ దాస్‌, సుబేదార్‌ జగదీష్‌ ప్రసాద్‌ యాదవ్‌, అమన్‌దీప్‌ సింగ్‌, 15వ ఒడిశా బెటాలియన్‌ ఎన్‌సీసీ జయపురం హవల్దార్‌ విక్రమ సింగ్‌ అగ్నివీర్‌ పథకంపై క్షుణ్ణంగా వివరించారు. యువత దేశసేవ అవసరాన్ని వివరిస్తూ అ గ్నివీర్‌పథకం ద్వారా భారతీ సైన్యంలో చేరి దేశ భద్రతకు తమవంతు సేవలు అందించాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో పెద్ద ఎత్తున ఎన్‌సీసీ క్యాడెట్లు పాల్గొని అగ్నివీర్‌ పథకంలో చేరేందుకు ఆసక్తి కనబర్చారు. కార్యక్రమంలో ఎన్‌సీసీ అధికారులు అలుమ్ని శ్రీనివాస పట్నాయక్‌, విక్రమదేవ్‌ విశ్వవిద్యాలయం కెప్టెన్‌ డాక్టర్‌ లక్ష్మణ పాత్రో, లెప్టెనెంట్‌ సంతోషి ముండ పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement