భువనేశ్వర్: రాష్ట్ర గవర్నర్ డాక్టర్ హరి బాబు కంభంపాటి న్యూ ఢిల్లీ పర్యటనలో భాగంగా కేంద్ర సమాచార–ప్రసార మరియు ఎలక్ట్రానిక్స్–సమాచార సాంకేతిక, రైల్వే శాఖల మంత్రి అశ్విని వైష్ణవ్‌ను కలిశారు. ఈ సందర్భంగా ఒడిశాకు సంబంధించిన కీలక అభివృద్ధి అంశాలపై వీరివురు సంభాషించారు. రాష్ట్ర వృద్ధి, కనెక్టివిటీకి దోహదపడే మౌలిక సదుపాయాల బలోపేతం కార్యకలాపాలను వేగవంతం చేయడంపై ఈ సంభాషణ దృష్టి సారించినట్లు పేర్కొన్నారు.
రాష్ట్ర మంత్రికి పరామర్శ
రాష్ట్ర రెవెన్యూ, విపత్తు నిర్వహణ విభాగం మంత్రి సురేష్ కుమార్ పూజారి అనారోగ్యంతో ఉన్న విషయం తెలిసి న్యూఢిల్లీ అఖల భారత వైద్య విజ్ఞాన సంస్థ (ఎయిమ్స్) సందర్శించి పరామర్శించారు. ఆరోగ్యం త్వరగా కోలుకుని రాష్ట్రానికి తిరిగి రావాలని శుభాకాంక్షలు తెలిపారు.


