భువనేశ్వర్: స్థానిక భారతీయ సాంకేతిక సంస్థ (ఐఐటీ)కు చెందిన జాతీయ సేవా పథకం (ఎన్‌ఎస్‌ఎస్) బృందం శనివారం స్వచ్ఛంద రక్తదాన శిబిరం నిర్వహించింది. క్యాంపస్ కమ్యూనిటీ సెంటర్‌లో సంజీవన్ ఆరోగ్య కేంద్రం సహకారంతో నిర్వహించిన ఈ శిబిరంలో 122 యూనిట్ల రక్తం సేకరించారు. కార్యక్రమానికి డైరెక్టర్ ప్రొఫెసర్ శ్రీపాద్ కర్మల్కర్ విచ్చేసి రక్తదాతలు, ఎన్‌ఎస్‌ఎస్ వలంటీర్లను ప్రోత్సహించారు. ఎన్‌ఎస్‌ఎస్ సమన్వయకర్త డాక్టర్ శివయ్య బత్తుల సారథ్యంలో ఈ శిబిరం నిర్వహించారు. సంస్థకు చెందిన అధ్యాపకులు, సిబ్బంది, విద్యార్థులు, నివాసితులు ఈ కార్యక్రమంలో పాల్గొని రక్తదానం చేశారు.


