అడవులను సంరక్షించాలి
రాయగడ: పర్యావరణ సమతుల్యానికి ఎంతగానో దోహదపడే మొక్కలను నాటడంతో పాటు వాటిని సంరక్షించాలని జిల్లాలోని కల్యాణ సింగుపూర్, కాసీపూర్ అటవీ శాఖ రేంజర్ పరిధి సిబ్బంది శుక్రవారం చైతన్య ర్యాలీ కల్యాణసింగుపూర్‌లో నిర్వహించారు. పచ్చని చెట్లను అక్రమంగా నరికి వేస్తుండడంతో అడవులు అంతరిస్తున్నాయని, అదేవిధంగా విలువైన ఔషధ వృక్షాల సైతం అంతరించిపోతున్నాయన్నారు. చెట్లను కాపాడుకోకపోతే భవిష్యత్‌లో పెను ప్రమాదం పొంచుకొస్తుందని ర్యాలీలో నినాదాలు చేశారు. కాసీపూర్ అటవీ శాఖ రేంజర్ సచ్చిదానంద పరిడ నేతృత్వంలో అటవీ శాఖ సిబ్బంది, ఫారెస్టర్లు తదితరులు బైకు ర్యాలీ నిర్వహించారు. అనంతరం ప్లకార్డులు పట్టుకుని ప్రచారం చేశారు. అనంతరం కల్యాణ సింగుపూర్ అటవీ శాఖ కార్యాలయంలో ఈ మేరకు సమావేశాన్ని నిర్వహించి, అడవుల సంరక్షణలో అటవీ శాఖకు చెందిన ప్రతీ ఒక్కరి బాధ్యతగా గుర్తించాలని సూచించారు.
అడవులను సంరక్షించాలి


