నైపుణ్యాలు అలవర్చుకోవాలి | - | Sakshi
Sakshi News home page

నైపుణ్యాలు అలవర్చుకోవాలి

Feb 22 2026 7:01 AM | Updated on Feb 22 2026 7:01 AM

నైపుణ్యాలు అలవర్చుకోవాలి

నైపుణ్యాలు అలవర్చుకోవాలి

మల్కన్‌గిరి: కిశోర బాలికలు నైపుణ్యాలు అలవర్చుకోవాలని అదనపు కలెక్టర్‌ సోమనాథ్‌ ప్రధాన్‌, జిల్లా సామాజిక సంక్షేమ అధికారి గౌరి నాయక్‌, భద్రతా అధికారి టి.జయలక్ష్మి అన్నారు. స్థానిక ఎస్‌ఎల్‌సీ సభాగృహంలో బాలికల జిల్లాస్థాయి నైపుణ్య శిక్షణ కార్యక్రమం శనివారం నిర్వహించారు. జిల్లా కో–ఆర్డినేటర్‌ మీనాక్షి ప్రదాన్‌ ఆర్థిక అక్షరాస్యత, సైబర్‌ భద్రత కమ్యూనికేషన్‌ నైపుణ్యలపై శిక్షణ ఇచ్చారు. అలాగే సాఫ్ట్‌ స్కిల్స్‌, కంప్యూటర్‌ పరిజ్ఞానంపై విద్యాశాఖకు చెందిన మాననస్‌ రంజన్‌ సేనాపతి, శుద్ధి రంజన్‌ సిద్దార్థలు వివరించారు. ఉపాధి అవకాశాలపై మిషన్‌ శక్తి డీపీసీ హర్షానంద ప్రధాన్‌ అవగాహన కల్పించారు. అనంతరం శిక్షణలో పాల్గొన్న బాలికలకు ధ్రువీకరణ పత్రాలు అందజేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement