‘దేశ ప్రగతికి సమైక్యంగా పనిచేద్దాం’ | - | Sakshi
Sakshi News home page

‘దేశ ప్రగతికి సమైక్యంగా పనిచేద్దాం’

Feb 21 2026 7:08 AM | Updated on Feb 21 2026 7:08 AM

‘దేశ

‘దేశ ప్రగతికి సమైక్యంగా పనిచేద్దాం’

జయపురం: దేశ ప్రగతికి జాతి భేదాలు విడిచి సమైక్యంగా పనిచేయాలని సామాజిక సద్భావన సమావేశం పిలుపు నిచ్చింది. బుధవారం స్థానిక అగ్రసేన్‌ భవనంలో రాష్ట్రీయ స్వయం సేవక సంఘం వారు నిర్వహించిన సామాజిక సద్భావన సమావేశంలో పాల్గొన్న ప్రముఖులు ఈ అభిప్రాయం వ్యక్తం చేశారు. పట్టణంలో వివిధ జాతులకు చెందిన 50 మందికిపైగా ప్రముఖులు కార్యక్రమంలో పాల్గొన్నారు. సనాతన ధర్మ పరిరక్షణతో పాటు వికసిత భారత్‌ స్వప్నాన్ని సాకారం చేయటానికి అందరూ కట్టుబడి ఉండాలని వారు పిలుపు నిచ్చారు. కార్యక్రమంలో ఆర్‌ఎస్‌ఎస్‌ సహసర్‌ కార్యవాక్‌ శ్రీరామ దత్త చక్రర్‌జీ, క్షేత్ర ప్రచారఖ్‌ జగదీష ఖడంఘా మాట్లాడుతూఽ దేశ, ప్రపంచ సమగ్ర అభివృద్ధి కోసం ‘పంచ పరివర్తన’ కార్యక్రమాలపై పనిచేయాలని పిలుపు నిచ్చారు. స్వధర్మం, స్వభాష, స్వసంస్కృతి పట్ల కట్టుబడి ఉండాలన్నారు. సమావేశంలో, పశ్చిమ ప్రాంత ప్రచారక్‌ సురేంధ్ర పండ, సహప్రాంత కార్యవాహి హరిశ్చంధ్ర పండ, విభాగ అధికారి మహేశ్వర భత్రొ,జిల్లా ప్రచారక్‌ చిదానంద శతపతి, పట్టణ సంఘ్‌ పరిచాలకులు డాక్టర్‌ నిరంజన్‌ మిశ్ర తదితరులు ప్రసంగించారు.

‘దేశ ప్రగతికి సమైక్యంగా పనిచేద్దాం’1
1/1

‘దేశ ప్రగతికి సమైక్యంగా పనిచేద్దాం’

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement