ఫిబ్రవరి 28 నుంచి ఉత్కళ సమ్మిళిత సమావేశాలు
జయపురం: ఫిబ్రవరి 28వ తేదీ నుంచి మార్చి 1వ తేదీ వరకు జయపురం కాళ్ల సాహి హరిశ్చంద్ర పార్క్‌లో కొరాపుట్ జిల్లా ఉత్కళ సమ్మిళిత సమావేశాలు నిర్వహించడానికి తీర్మానించారు. ఉత్కళ సమ్మిళిత కొరాపుట్ జిల్లా అధ్యక్షుడు మదన మోహన నాయిక్ అధ్యక్షతన శుక్రవారం నిర్వహించిన సమావేశంలో రెండు ప్రధాన ప్రతిపాదనలపై చర్చించారు. బ్యాంక్ అకౌంట్ సక్రమంగా నిర్వహించాలని, ఆ బాధ్యతలు నిర్వహించేందుకు బాధ్యతలు అప్పగించిన కార్యదర్శి నవీన మదలకు సూచించారు. సమావేశంలో ఉత్కళ సమ్మిళిత రాష్ట్ర కార్యదర్శి బిరెన్ మోహన పట్నాయిక్, జయపురం మున్సిపల్ మాజీ ఉపాధ్యక్షుడు సూర్యనారాయణ రథ్, బీజేడీ నేత బాలారాయ్, జయపురం సాహితీ పరిషత్ అధ్యక్షుడు హరిహర కరసుధా పట్నాయిక్, రచయిత కృష్ణచంద్ర తదితరులు పాల్గొన్నారు.


