
తరలిపోతున్న రుతు పవనాలు
భువనేశ్వర్: రాష్ట్రం నుంచి రుతు పవనాలు క్రమంగా వెడలిపోతున్నాయి. పశ్చిమ, ఉత్తర ఒడిశా ప్రాంతాల్లో పలు జిల్లాల నుంచి రుతు పవనాలు తరలిపోయాయి. ఝార్సుగుడ, సుందర్‌గఢ్, బర్‌గఢ్, కెంజొహర్, మయూర్‌భంజ్ జిల్లాల నుంచి రుతుపవనాలు మంగళవారం తరలిపోయినట్లు వాతావరణ శాఖ సమాచారం.
మనేంగులు గ్రామాన్ని
పంచాయతీగా గుర్తించాలి
రాయగడ: జిల్లాలోని గుణుపూర్ సబ్ డివిజన్ పరిధి పుటాసింగి పంచాయతీలో ఉన్న మనేంగులు గ్రామాన్ని పంచాయతీగా గుర్తించాలని 12 గ్రామాలకు చెందిన ప్రతినిధులు సబ్ కలెక్టర్ కార్యాలయం అధికారికి మంగళవారం వినతిపత్రం అందజేశారు. పుటాసింగి పంచాయతీ పరిధి కుభులంసి, గాయులంగి, గుణుడురుబ, పొడలకిపాయి, రుడిసిన్, ఆబాసి, లింగియార్, జంగ్‌జంగ్, బాసేంగొగొరొజాంగొ, సొలాడంసి, లయిబ గ్రామాల ప్రజలు పంచాయతీ కేంద్రానికి చేరుకోవాలంటే 15 కిలోమీటర్ల దూరం వెళ్లాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. దీనివల్ల అత్యవసర పరిస్థితుల్లో ఇబ్బందులు పడుతున్నామని వినతిపత్రంలో పేర్కొన్నారు. అందువల్ల మనేంగులు గ్రామాన్ని పంచాయతీగా గుర్తించగలిగితే తాము ఎన్నో సమస్యల నుంచి గట్టెక్కుతామని వివరించారు. అదేవిధంగా గ్రామాలు కూడా అభివృద్ధి చెంది మౌలిక సౌకర్యాలు పొందే అవకాశం ఉంటుందని వివరించారు.
డాక్టర్ తిరుపతి పాణిగ్రాహికి ఐసీఎఫ్‌ఏఐ జీవన సాఫల్య పురస్కారం
భువనేశ్వర్: హైటెక్ సంస్థల వ్యవస్థాపక అధ్యక్షుడు డాక్టర్ తిరుపతి పాణిగ్రాహికి ఐసీఎఫ్‌ఏఐ విశ్వవిద్యాల యం జీవన సాఫల్య పురస్కారం ప్రదానం చే సింది. సిక్కిం గ్యాంగ్‌టక్‌లోని ఇనిస్టి్‌ూట్యట్ ఆఫ్ చార్టర్డ్ ఫైనాన్షియల్ అనలిస్టిస్ ఆఫ్ ఇండి యా (ఐసీఎఫ్‌ఏఐ) విశ్వవిద్యాలయం 18వ స్నాతకోత్సవం, సిక్కిం 50వ వార్షికోత్సవం పురస్కరించుకుని హై టెక్ గ్రూప్ వ్యవస్థాపకు డు డాక్టర్ తిరుపతి పాణిగ్రాహికి ఈ పురస్కా రం ప్రదానం చేయడం విశేషం. ఒడిశాలో వి ద్య, ఆరోగ్య రంగంలో విప్లవాత్మక పరివర్తనకు, జీవితకాల అంకితభావానికి గాను జీవన సాఫల్య పురస్కారంతో సత్కరించనున్నట్లు ఐసీఎఫ్‌ఏఐ విశ్వవిద్యాలయ రిజిస్ట్రార్ తెలిపా రు. ఈ సందర్భంగా భారత దేశంలోని అనేక మంది ప్రముఖులను సత్కరించనున్నారు.
అన్నని హత్య చేసిన తమ్ముడు అరెస్టు
కొరాపుట్: అన్నని హత్య చేసిన తమ్ముడిని పోలీసులు అరెస్ట్ చేశారు. మంగళవారం నబరంగ్‌పూర్ జిల్లా కేంద్ర పోలీస్‌స్టేషన్ ఒక ప్రకటనలో ఈ వివరాలు ప్రకటించింది. ఈనెల 11వ తేదీన సింధిగుడ గ్రామంలో ధనుర్జయ హరిజన్ (40)ని ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు హత్య చేశారని అతని సోదరుడు రాజు హరిజన్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. ఈ కేసు విచారణ చేపట్టిన పోలీసులు గ్రామంలో పలు కోణాల్లో దర్యాప్తు చేపట్టారు. దీంతో మృతుడి మరో తమ్ముడు మఖర హరిజన్ ఇంట్లో ఎవరూ లేనప్పుడు ధనుర్జయ ముఖంకి వస్త్రం కప్పి ఊపిరి ఆడకుండా చేసి హత్య చేసినట్లు తేలింది. పోలీసుల విచారణలో నిందితుడు తన నేరం అంగీకరించాడు. నిందితుడు మఖర్ హరిజన్‌ని పోలీసులు అరెస్ట్ చేసి జైలుకి తరలించారు.

తరలిపోతున్న రుతు పవనాలు

తరలిపోతున్న రుతు పవనాలు

తరలిపోతున్న రుతు పవనాలు