
సెంచూరియన్ వర్సిటీ ఆధ్వర్యంలో థ్రాంబోసిస్ దినోత్సవం
పర్లాకిమిడి: రాణిపేట గ్రామంలోని ఎస్పీ కార్యాలయం కాన్ఫరెన్స్ హాల్‌లో ప్రపంచ థ్రాంబోసిస్ దినోత్సవం సందర్భంగా సెంచూరియన్ వర్సిటీ నర్సింగ్ విద్యార్థులు ఆరోగ్య పరీక్ష శిబిరం నిర్వహించారు. కాళ్ల రక్తనాళాల్లో గడ్డ కట్టడాన్ని డీప్ వెయిన్ థ్రాంబోసిస్ అంటారు. కొన్నిసార్లు ఇది తీవ్రమైన సమస్యలకు దారి తీస్తుంది. దీని వల్ల గడ్డలు విరిగిపోయి ఊపిరితిత్తులు లేదా గుండె వంటి అవయవాలకు చేరవచ్చు అని వక్తలు అన్నారు. కార్యక్రమం ఎస్పీ జ్యోతింద్ర కుమార్ పండా, డీఎస్పీ అమితా పండా సహకారంతో జరిగింది. శిబిరంలో పోలీసు సిబ్బందికి ఽథ్రాంబోసిస్ నివారణ కోసం కాలి వ్యాయామాల ప్రదర్శన నిర్వహించారు. 30 మంది పోలీసు సిబ్బందికి రక్తపోటు, బాడీ మస్ ఇంటెక్స్, ఎత్తు, బరువు వంటి పరీక్షలు కూడా నిర్వహించారు. సెంచూరియన్ వర్సిటీ రిజిస్ట్రార్ అనితా పాత్రో, డైరక్టర్ (అడ్మిన్) డాక్టర్ దుర్గాప్రసాద్ పాఢి, డాక్టర్ ఎస్పీ నందా, నర్శింగ్ విద్యార్థినులు తదితరులు పాల్గొన్నారు.

సెంచూరియన్ వర్సిటీ ఆధ్వర్యంలో థ్రాంబోసిస్ దినోత్సవం