
గంజాయితో పట్టుబడిన కంటైనర్
పర్లాకిమిడి: గజపతి జిల్లా గుసాని సమితి లావణ్యగడ వద్ద మంగళవారం ఎకై ్సజ్ శాఖ ఒక కంటైనర్‌లో సోదాలు చేయగా, అందులో గంజాయి ప్యాకెట్లు బయటపడినట్లు ఎకై ్సజ్ ఇన్‌స్పెక్టర్ ప్రసన్న కుమార్ పటేల్ తెలియజేశారు. వెంటనే కంటైనర్ డ్రైవర్, హెల్పర్ పారిపోగా.. అందులో ఉన్నటువంటి ఇద్దరు వ్యక్తులను అరెస్టు చేశారు. వారిలో జిరంగో గ్రామానికి చెందిన సుమేష్ లిమ్మా, ఆర్.ఉదయగిరికి చెందిన జోథామ్ లిమ్మా ఉన్నారు. ఈ పార్శిల్ కంటైనర్ హర్యానా రాష్ట్రం నుంచి వస్తువులు జిల్లాకు చేరవేసి, తిరిగి వెళ్లే సమయంలో గంజాయిని తరలిస్తున్న వచ్చిన సమాచారం మేరకు మంగళవారం ఉదయం దాడులు చేసి పట్టుకున్నారు. పట్టుబడిన గంజాయి విలువ సుమారు 41.5 క్వింటాళ్లు ఉండగా.. దీని విలువ సుమారు రూ.45 లక్షలు ఉంటుందని వెల్లడించారు. గజపతి జిల్లా ఎకై ్సజ్ శాఖ సూపరింటెండెంట్ ప్రదీప్ కుమార్ సాహు ఆదేశాల మేరకు ఈ దాడులు జరిగినట్లు ఎకై ్సజ్ అధికారి కె.బాలాజీరావు తెలిపారు. దాడుల్లో విజయకుమార్ మల్లిక్, నీలాంబర నాయక్ తదితరులు పాల్గొన్నారు.