
భరతజాతి ముద్దుబిడ్డ అంబేడ్కర్
సరుబుజ్జిలి: భరతజాతి గర్వించదగ్గ ముద్దుబిడ్డ, రాజ్యాంగా సృష్టికర్త డాక్టర్ బి.ఆర్.అంబేడ్కర్ అని మాజీ స్పీకర్, వైఎస్సార్ సీపీ శ్రీకాకుళం పార్లమెంటరీ పార్టీ అధ్యక్షుడు తమ్మినేని సీతారాం అన్నారు. పాలవలసలో ఏర్పాటుచేసిన అంబేడ్కర్ విగ్రహాన్ని మంగళవారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అంటరానితనానికి వ్యతిరేకంగా పోరాడిన మహనీయుడు అంబేడ్కర్ అని కొనియాడారు. అనంతరం దంతపురి బౌధ్దక్షేత్రంలో 69వ దమ్మదీక్ష దినోత్సవ బౌద్ధ సమ్మేళనంలో స్పీకర్ పాల్గొన్నారు. బుద్ధుడి ప్రాముఖ్యతను వివరించారు. కార్యక్రమంలో అంబేడ్కర్ ఇండియన్ మిషన్ రాష్ట్ర అధ్యక్ష ఉపాధ్యక్షులు కంఠ వేణు, తైక్వాండో శ్రీను, పీఎస్‌ఎన్ మూర్తి, కె.కె.రాజా, బుద్ధిస్ట్ సొసైటీ అధ్యక్షుడు హరిబాబు, సామాజిక పోరాట సమితి అధ్యక్షుడు కల్లేపల్లి రాంగోపాల్, గొల్లపల్లి సురేష్, యడ్ల ఈశ్వరరావు, అదపాక గౌరినాయుడు, ఇల్లాకుల సూర్యప్రకాశరావు, కొంచాడ సూర్యనారాయణ,గొల్లపల్లి నందేష్,, బొత్స వెంకటరమణ పాల్గొన్నారు.