
పర్లాకిమిడిలో పల్స్‌పోలియో
పర్లాకిమిడి: జిల్లా స్థాయి పల్స్‌పోలియో కార్యక్రమాన్ని స్థానిక ప్రభుత్వ కేంద్ర ఆస్పత్రి మాతాశిశు ఆస్పత్రిలో ఆదివారం ఉదయం జిల్లా ముఖ్యచికిత్సాధికారి, డీహెచ్‌ఓ డాక్టర్ మహ్మద్ ముబారక్ ఆలీ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, జిల్లాలో అన్ని ప్రాథమిక, కమ్యూనిటీ ఆస్పత్రుల్లో రెండు చుక్కల పల్స్‌పోలియో కార్యక్రమం ప్రారంభిస్తున్నామని, సోమ, మంగళవారాల్లో ఆరోగ్య కార్యకర్తలు ఇంటింటికి వెళ్లి పల్స్ పోలియో చుక్కలు చంటి పిల్లలకు వేస్తామని అన్నారు. పొరుగు దేశాలైన ఆఫ్ఘనిస్తాన్, బంగ్లాదేశ్‌లో పోలియో వ్యాధి ఎక్కువగా ఉన్నందున భారత్‌లో తిరిగి పల్స్‌పోలియో నిర్వహిస్తున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో డి.పి.యం. సరితా మహాపాత్రో ముఖ్యవక్తగా వ్యవహారించగా, జిల్లా పరిషత్తు ముఖ్యకార్యనిర్వాహాణ అధికారి శంకర్ కెరకెటా ముఖ్యఅతిధిగా విచ్చేశారు. ఇతర అతిథిలుగా డాక్టర్ రబినారాయణ దాస్, డాక్టర్ శంతును పాఢి, డీఎంఎస్‌ఎం ప్రణతి సాహు తదితరులు పాల్గొని మాట్లాడారు.

పర్లాకిమిడిలో పల్స్‌పోలియో

పర్లాకిమిడిలో పల్స్‌పోలియో