
స్వాతంత్య్ర సమరయోధుడు రాబిసింగ్ మజ్జికి నివాళులు
కొరాపుట్: స్వాతంత్య్ర సమరయోధుడు స్వర్గీయ రబిసింగ్ మజ్జి 103వ జయంతి కార్యక్రమం ఆయన స్వగ్రామం నబరంగ్‌పూర్ జిల్లా ఉమ్మర్‌కోట్ డివిజన్ బట్టిబెడా గ్రామంలో ఆదివారం జరిగింది. ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పి్‌ంచారు. కార్యక్రమంలో పాల్గొన్న మాజీ మంత్రి రమేష్ చంద్ర మజ్జి మాట్లాడుతూ.. స్వాతంత్య్రం అనంతరం రబిసింగ్ మంత్రి హోదాలో ఈ ప్రాంత అభివృద్ధికి ఎనలేని కృషి చేశారని గుర్తు చేశారు. గ్రామంలోని రబిసింగ్ విగ్రహానికి గ్రామస్తులతో కలసి నివాళులర్పించారు. ఉమ్మర్ కోట్ పట్టణంలో రబిసింగ్ జయంతి కార్యక్రమం నిర్వహించగా.. స్థానిక మంత్రి నిత్యానంద గోండో తన అనుచరులతో సింగ్ విగ్రహానికి నివాళులఅర్పించారు.

స్వాతంత్య్ర సమరయోధుడు రాబిసింగ్ మజ్జికి నివాళులు