
మజ్జిగౌరి దర్శనానికి భక్తుల తాకిడి
రాయగడ: ఆంధ్ర, ఒడిశా ప్రజల ఆరాధ్య దైవంగా పూజలందుకుంటున్న మజ్జిగౌరి మందిరానికి ఆదివారం భక్తులు పోటెత్తారు. ఈ రెండు రాష్ట్రాలకు చెందిన భక్తులతో పాటు మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. అమ్మవారి మందిరాన్ని ఉదయం తెల్లవారుజాము 3.30 గంటలకే మంగళహారతితో తెరుచుకోగా అప్పటి నుంచే భక్తులు క్యూలైన్‌లో బారులుదీరారు. భక్తుల సౌకర్యార్ధం ఆలయ కమిటీ ఏర్పాటు చేసిన 300 రుపాయల ప్రత్యేక దర్శనంలో కూడా రద్దీ బాగా కనిపించింది. ప్రత్యేక దర్శనం టిక్కెట్ తీసుకున్న భక్తులకు అమ్మవారి దర్శనం కోసం సుమారు మూడు గంటల సమయం పట్టింది. అయితే సాధారణ దర్శనం కోసం భక్తులు పడిగాపులు పడ్డారు. ఇదిలాఉండగా అమ్మవారి దర్శనం కోసం సుదూర ప్రాంతాల నుంచి వచ్చిన భక్తుల ఇబ్బందులు ఎదుర్కొని గత్యంతరం లేక ఆరుబయట మొక్కలు తీర్చుకుని వెళ్లాల్సి వచ్చింది.

మజ్జిగౌరి దర్శనానికి భక్తుల తాకిడి