
నిండు గర్భిణి.. రెండు కిలోమీటర్ల నడక
మల్కన్‌గిరి: మల్కన్‌గిరి జిల్లా మత్తిలి సమితి కతాపాల్లి పంచాయతీ బేదురుపల్లి గ్రామంలో ఆదివారం కనక్ దెయిదువువ అనే నిండు గర్భిణి రెండు కిలోమీటర్లు మట్టి రోడ్డులో కాలినడకన వెళ్లి అంబులెన్స్‌ను చేరుకుంది. గ్రామానికి రోడ్డు సదుపాయం లేకపోవడంతో అంబులెన్స్‌ను కతాపల్లి కూడలి వరకు మాత్రమే వచ్చింది. దీంతో గర్భిణి రెండు కిలోమీటర్లు నడిచి అంబులెన్స్‌ను చేరుకున్నాక మత్తిలి ఆరోగ్య కేంద్రానికి తరలించారు.
రూ.లక్షల విలువైన
నకిలీ గుట్కా స్వాధీనం
మల్కన్‌గిరి: మల్కన్‌గిరి జిల్లా బలిమెల పోలీసులు ఆదివారం బలిమెల పోలీసులు ఓ పూజా దుకాణం నుంచి రూ.లక్షల విలువైన నకిలీ గుట్కాలకు స్వాధీనం చేసుకున్నారు. చిత్రకొండ సమితి డైక్ 3 గ్రామానికి చెందిన ప్రశాంత్ పాత్రో బలిమెల డైలీ మార్కెట్‌లో ఓ పూజా సామగ్రి దుకాణాన్ని నడుపుతున్నాడు. లైసెన్స్ లేకపోవడంతో బలిమెల ఐఐసీ ధీరజ్ పట్నాయిక్ ఆదివారం ఆ దుకాణం పై దాడి చేసి ప్రశాంత్‌ను అరెస్టు చేసి నకిలీ గుట్కాలు స్వాధీనం చేసుకున్నారు.