
ముఖ్యమంత్రిని కలిసిన తిరుపతి పాణిగ్రాహి
భువనేశ్వర్: రాష్ట్ర ముఖ్యమంత్రి మోహన్ చరణ్ మాఝీని హైటెక్ గ్రూప్ వ్యవస్థాపక అధ్యక్షుడు డాక్టర్ తిరుపతి పాణిగ్రాహి కలిశారు. ఈ సందర్భంగా హైటెక్ ఉన్నత శ్రేణి ఆస్పత్రుల్లో ఆయుష్మాన్ భారత్ ఆరోగ్య బీమా సౌలభ్యం కల్పించడంపై ముఖ్యమంత్రికి హామీ ఇచ్చారు. ముఖ్యమంత్రితో మర్యాదపూర్వకంగా కలిసిన తిరుపతి పాణిగ్రాహి రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వం సంయుక్తంగా రాష్ట్రంలో ప్రారంభించిన ఆయుష్మాన్ హెల్త్ కార్డ్ ఆరోగ్య సేవల రంగంలో విప్లవాత్మక సంస్కరణలకు నాంది పలికింది. దిగువ, మధ్యతరగతి, పేద మరియు బలహీన వర్గాలకు చికిత్స సులభతరమైంది. ఆయుష్మాన్ హెల్త్ కార్డ్ కారణంగా మణిపూర్, చత్తీస్‌గఢ్, జార్ఖండ్ తదితర దూరప్రాంతాల నుంచి విచ్చేసిన రోగులకు హైటెక్ ఆస్పత్రిలో ఉన్నత వైద్య, చికిత్స సదుపాయాలు కల్పిస్తున్నట్లు వివరించారు.