
సమస్యలు పరిష్కరించాలి
కొరాపుట్: రైళ్లు సురక్షితంగా నడపడానికి సందేశం ఇచ్చే రైల్వేస్టేషన్ మాస్టర్ల సమస్యలు పరిష్కరించాలని ఆల్ ఇండియా స్టేషన్ మాస్టర్స్ అసోసియేషన్ (ఈస్ట్‌కోస్ట్ జోన్) విజ్ఞప్తి చేసింది. శనివారం కొరాపుట్ జిల్లా కేంద్రంలో ఈస్ట్‌కోస్ట్ రైల్వేస్టేషన్ మాస్టర్ల సర్వసభ్య సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సెంట్రల్ అడ్వైజర్ కమిటీకి చెందిన పీసీ సామల్ (ఖుర్ధా) మాట్లాడుతూ.. రైల్వే విభాగంలో స్టేషన్ మాస్టర్ల ఖాళీ పోస్టులు భర్తీ చేయాలని కోరారు. నైట్ షిప్ట్ అలవెన్స్ అందరికీ ఇవ్వాలని, పని గంటల ఒత్తిడి వలన రద్దీ స్టేషన్లలో అదనపు స్టేషన్ మాస్టర్లను నియమించాలని డిమాండ్ చేశారు. తమ సమస్యలను డీఆర్‌ఎం ద్వారా రైల్వే బోర్డుకి పంపాలని నిర్ణయించారు. సమావేశంలో జోనల్ ప్రెసిడెంట్ పీఎన్ మూర్తి (విశాఖపట్నం), సంయుక్త కార్యదర్శి పి.నారాయణరావు (కొరాపుట్) తదితరులు పాల్గొన్నారు.